Ravi Teja: “ఈగ‌ల్” ఫిబ్ర‌వ‌రిలో అవ‌స‌ర‌మా మ‌హారాజా?

Ravi Teja: మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన ఈగ‌ల్ (eagle) సినిమా జ‌న‌వ‌రి రేసు నుంచి త‌ప్పుకుంది. ఫిబ్ర‌వ‌రిలో సోలో రిలీజ్ స్లాట్ ఎంచుకుంది. అయితే ర‌వితేజ సినిమాల‌కు ఫిబ్ర‌వ‌రి నెల క‌లిసిరాదు. ఈ విష‌యం ఆయ‌న గ‌తంలో న‌టించిన నాలుగు సినిమాలే చెప్తున్నాయి. ర‌వితేజ న‌టించిన షాక్, నిప్పు, ట‌చ్ చేసి చూడు, ఖిలాడి సినిమాలు ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ అయ్యాయి. ఈ నాలుగు సినిమాలూ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు కొత్త సినిమా ఈగ‌ల్ కూడా ఫిబ్ర‌వ‌రిలోనే రిలీజ్ అవుతోంది. ఆ నాలుగు సినిమాల లాగా కాకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని ఈ ఫిబ్ర‌వ‌రి బ్యాడ్ సెంటిమెంట్ త‌ప్ప‌ని నిరూపించాల‌ని మాస్ మ‌హారాజాకు మంచి హిట్ ఇవ్వాల‌ని కోరుకుందాం.