Family Star: విజ‌య్ సినిమాకు అరుదైన ఘ‌న‌త‌

Family Star: విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Devarakonda) న‌టించిన ఫ్యామిలీ స్టార్ సినిమా అరుదైన ఘ‌న‌త సాధించింది. ఉరుగ్వేలో రిలీజ్ అవ్వ‌బోయే తొలి సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు సినిమా కూడా అక్క‌డ రిలీజ్‌కు నోచుకోలేదు. కానీ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అక్క‌డి తెలుగు ఆడియ‌న్స్ రిక్వెస్ట్ చేయ‌డంతో ఆయ‌న అక్క‌డ రిలీజ్ అయ్యేలా అనుమ‌తి తెప్పించుకున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) న‌టించింది. ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ కాబోతోంది.