Eagle: థియేటర్లో ఫట్.. OTTలో హిట్
Eagle: మాస్ మాహారాజా రవితేజ (Ravi Teja) బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇటీవలే ‘ఈగల్’ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు. ట్రైలర్, సాంగ్స్‌తోనే విడుదలకు ముందే సినిమాపై అంచనాలను కలిగించారు మేకర్స్. అంతేకాకుండా ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించిన రవితేజ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ తెరకెక్కించాడనే కామెంట్స్ వినిపించాయి.
నిజం చెప్పాలంటే ఈ సినిమాకు భారీ యాక్షన్ బ్లాక్స్ హైలెట్ గా మారాయి. కథలో కొత్తదనం లేనప్పటికీ, ప్రెజెంటేషన్ స్టైలీష్ గా ఉండటం, రవితేజ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉండటంతో ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ గా రూ.50 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాతలకు మోస్తారు లాభాలు తెచ్చిపెట్టింది.
ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమాను ఈ మధ్యే ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. ఆ క్రమంలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఇండియా వైడ్ గా టాప్ పొజిషన్ లో ట్రెండ్ అవుతోంది. (Eagle)
సినిమాలో రవితేజ ఎలివేషన్స్ కానీ మాస్ సీన్స్ కానీ, ఓవరాల్ క్వాలిటీ కానీ, ఎక్స్ లెంట్ గా ఉండటంతో ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవుతుంది. కొన్ని చోట్ల సినిమా డ్రాగ్ అయినట్లు అనిపించినా కానీ రీసెంట్ టైంలో రవితేజ నుండి వచ్చిన సినిమాల్లో క్రాక్, ధమాకా లాంటి సినిమాల తర్వాత బెస్ట్ మూవీ ఇదేనన్న టాక్ అయితే ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది. అన్ సీజన్ లో రిలీజ్ అవ్వకుండా మంచి హాలిడేస్ ఉన్న టైంలో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే, కచ్చితంగా ఆడియన్స్ ను సినిమా బాగా ఆకట్టుకుని ఉండేదని అంటున్నారు,
కానీ అన్ సీజన్ ఇంపాక్ట్ వలన బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన మేర రెస్పాన్స్ సినిమాకి సొంతం అవ్వలేదు. కానీ ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడంతో ఊహించినట్లే సినిమాకి ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని రానున్న రోజుల్లో ఈగల్ మూవీ ఓటీటీలో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈగల్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు సీక్వెల్ గా ఈగల్ 2 రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.