Sexual Harassment: దుబాయ్ చేతిలో టాలీవుడ్ గుట్టు
Sexual Harassment: “” మొన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Sheik Jani) బాగోతం బయటపడింది. నిన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై (Trivikram Srinivas) నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సంచలన ఆరోపణలు చేసింది.. ఇవి రెండే కాదు.. దుబాయ్ తీగ లాగితే డొంకంతా కదులుతుంది. దుబాయ్ ట్రిప్‌లను స్కాన్ చేసామంటే టాలీవుడ్ కుప్పకూలిపోతుంది. ఈ మధ్యకాలంలో దుబాయ్‌కి మాటిమాటికీ ఎవరు వెళ్తున్నారో చూసుకోండి. ఒక్కోసారి అమ్మాయి ముందే వెళ్లిపోతుంది. ఆ తర్వాత అబ్బాయి వెళ్తాడు.
లేదంటే ఇద్దరూ ఒకే ఫ్లైట్‌లో ఒకరితో ఒకరికి సంబంధం లేదన్నట్లు వెళ్తారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకుంటారు. ఇద్దరూ దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తారు. కలిసే షాపింగ్‌కి వెళ్తారు. కలిసే గదిలో ఉంటారు. ఆ తర్వాత ఇద్దరికీ పరిచయం లేనట్లు సపరేట్ విమానాల్లో ఇండియాకి వచ్చేస్తారు. దుబాయ్ గుట్టు బయటపడితే టాలీవుడ్ పరిస్థితి ఏంటో భయమేస్తోంది “” ఈ మాట చెప్పింది ఎవరో కాదు. టాలీవుడ్‌కి చెందిన ఓ సీనియర్ నిర్మాత. ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి సంబంధించిన డార్క్ విషయాలన్నీ దుబాయ్‌కే తెలుసని ఆయన అన్నారు. జానీ మాస్టర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌కి చెందిన చాలా మంది వక్ర బుద్ధి గల వారు తమ విషయాలు ఎక్కడ బయటికి వస్తాయో అని వణికిపోతున్నారట.
ఇందుకోసం గతంలో ఎవర్నైతే వేధించారో వారికి డబ్బులు ఇవ్వడమో సినిమాల్లో అవకాశాలు కల్పించడమో వంటివి చేస్తూ వారి నోళ్లు మూయించేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. ఎవరైతే బాధితులు ఉన్నారో వారు అడిగిన వాటికి ఒప్పుకుని పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏమీ తెలీనట్లు అమాయకులైనట్లు పరువు తీసేందుకే ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా నటి పూనమ్ కపూర్ విషయంలో ఈ ప్రచారం బాగా జరుగుతోంది. జల్సా సినిమాలో పార్వతి మెల్టన్ పాత్ర పూనమ్ చేయాలి.
Sexual Harassment: : కానీ త్రివిక్రమ్ ఆ పాత్ర ఆమెకు దక్కనివ్వకుండా చేసాడట. అత్తారింటికి దారేది సినిమా విషయంలో కూడా అవకాశం పోవడంతో పూనమ్ త్రివిక్రమ్‌పై పగ పెంచుకుందని అంటున్నారు. నెలకు రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తూ ఖరీదైన కార్లలో తిరుగుతోందంటే వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఇటీవల ఓ తెలుగు నిర్మాత మాట్లాడిన ఆడియో లీక్‌లో బయటపడ్డాయి. ఎప్పుడో జరిగిన విషయాన్ని పూనమ్ ఇప్పుడు లేవనెత్తుతున్నారని.. పోనీ తగిన ఆధారాలు చూపించారా అంటే అదీ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూనమ్ ఫిర్యాదు చేయలేదు
త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేస్తున్న పూనమ్ కౌర్ గతంలో ఎప్పుడూ కానీ ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి రాలేదని అన్నారు ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరైన తమ్మారెడ్డి భరద్వాజ. కనీసం ఇప్పుడైనా సోషల్ మీడియాలో ట్వీట్లు చేయడం ఆపి మా అసోసియేషన్‌కు ఓ ఫిర్యాదు చేస్తే త్రివిక్రమ్ అయినా ఎవర్నైనా తాము పిలిపించి ప్రశ్నిస్తామని.. న్యాయం జరిగేలా చేస్తామని అంటున్నారు. మరోపక్క ట్విటర్‌లో ఆరోపణలు చేసిన పూనమ్ ఉన్నట్టుండి మౌనంగా ఉండిపోయింది. కనీసం చూపించదగిన ఆధారాలు కూడా ఆమె సోషల్ మీడియాలో పెట్టలేదు. దాంతో ఆమె కేవలం పాపులారిటీ కోసమో.. లేదా ఈ వంకతో అయినా అవకాశాలు ఇస్తారన్న ఆశతోనో ఇలాంటి ఆరోపణలు చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.