Bellamkonda Srinivas: ఎన్టీఆర్ హెల్ప్ వ‌ద్ద‌నుకున్నా

Hyderabad: సురేష్ బెల్లంకొండ‌(suresh bellamkonda) వంటి బ‌డా నిర్మాత కొడుకైన‌ప్ప‌టికీ(bellamkonda srinivas) ఎవ‌రి సాయం లేకుండా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ సొంత గుర్తింపు ఉండాల‌ని క‌ష్ట‌ప‌డుతున్నారు బెల్లంకొండ శ్రీనివాస్(bellamkonda srinivas). ఒక హీరోకి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఆయ‌న‌లో ఉన్నాయి. స‌రైన సినిమా ప‌డాలేకానీ ఆయ‌న కూడా మంచి న‌టుడని నిరూపించుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌దు. అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్.. హీరోయిజం ఎలివేట్ చేసే సినిమాల కంటే త‌న న‌ట‌న‌ను నిరూపించుకునే సినిమాల‌పైనే దృష్టిపెట్టారు. అలా ఆయ‌న సీత లాంటి ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలో న‌టించ‌డానికి కూడా వెనుకాడ‌లేదు. ఇప్పుడు ఛ‌త్ర‌ప‌తి సినిమా రీమేక్‌తో ఏకంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు. వి వి వినాయ‌క్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 12న రిలీజ్ అవ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఇంట‌ర్వ్యూలో ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు పంచుకున్నారు.

“నాకు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎన్టీఆర్(jr ntr), రామ్ చ‌ర‌ణ్(ram charan), అల్లు అర్జున్(allu arjun) వీరంతా నాకు బెస్ట్ ఫ్రెండ్స్. చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి పెరిగిన‌వాళ్లమే. ఇప్పుడు ఎవ‌రి ప‌నుల‌తో వారు బిజీగా ఉండ‌టంతో రెగ్యుల‌ర్‌గా క‌ల‌వ‌లేక‌పోతున్నాం. బ‌ట్ క‌లిస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం. అయితే నా సినిమాల కోసం ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్, బ‌న్నీల హెల్ప్ తీసుకోకూడ‌దు అనుకున్నాను. అడ‌గ్గానే వారు క్ష‌ణం ఆలోచించ‌కుండా ఓకే అంటారు. కానీ నాకు నేను సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అందుకే వారి హెల్ప్ అడ‌గ‌లేదు. అంతేకానీ వేరే ఉద్దేశంతో కాదు” అని తెలిపారు శ్రీనివాస్.