Sudha: విజయ్ ఆంటోనీ కూతురికి చీకటి అంటే భయం
ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ (vijay antony) కూతురు మీరా ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ (sudha) స్పందించారు. కళ్లముందే తిరిగిన పాప ఇప్పుడు లేదంటే తట్టుకోలేకపోతున్నానని కంటతడి పెట్టుకున్నారు. మీరా ఆత్మహత్య చేసుకుందని తెలీగానే కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ తనకు కలిగిందని.. బాధ పంచుకోగలిగే శక్తి ఉంటే వారి బాధను తనే తీసుకునేదాన్నని అన్నారు. మీరాకి చీకటి అంటే భయమని వాళ్ల నానమ్మ చెప్పారని.. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనేదానిపై ఇంకా ఏమీ తెలీలేదన్నారు. 80 ఏళ్ల వయసులో చనిపోతే వయసు అయిపోయింది అన్నీ చూసేసారు అనుకోవచ్చు కానీ ఇలా ఇంత చిన్న వయసులో ఆత్మహత్య ఆలోచనలు పెట్టుకోకూడదని విన్నవించుకున్నారు. ఏ బాధ ఉన్నా కూడా తల్లిదండ్రులతో పంచుకోవాలే కానీ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదంటూ కన్నీరుపెట్టుకున్నారు సుధ. (sudha)