NBK108: విలన్​ ఎవరో చెప్పేసిన డైరెక్టర్!

Hyderabad: ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) సినిమాసూపర్ సక్సెస్​తో ఈ ఏడాది ఘనంగా ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). ప్రస్తుతం బాలయ్య, అనిల్​ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. NBK108 వర్కింగ్​ టైటిల్​తో రూపొందుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటినుంచీ రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్​ రిలీజ్​ చేసినప్పటినుంచీ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్​లో విడుదల కానుందని ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్​డేట్​తో అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చారు డైరెక్టర్​ అనిల్​ రావిపూడి. ఈ సినిమాలో విలన్​గా బాలయ్యతో తలపడేది ఎవరో ప్రకటిస్తూ ఓ పోస్ట్​ చేశారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్​ చందమామ కాజల్​ అగర్వాల్(Kajal Aggarwal)​ నటించనుంది. మరో హీరోయిన్​గా కుర్రభామ శ్రీలీల(Sreeleela) కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిల్​ ఇంకా ఫైనల్​ కాలేదు. ఈ సినిమాకు ‘నాన్న గారు’, ‘రామారావు గారు’ అనే టైటిల్స్ పరిశీలనతో ఉన్నాయి. ఏది ఫైనల్ చేస్తారనేది చూడాలి. తాజాగా ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్(Arjun Rampal) నటిస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్​ అనిల్​ రావిపూడి. ఈ విషయమై ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా అర్జున్ రాంపాల్.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అన్నట్లు బాలయ్య డైలాగ్ చెప్పి అభిమానుల్లో జోష్ నింపాడు. నటుడిగా అర్జున్ రాంపాల్‌కు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం.