Miss Shetty Mr Polishetty Teaser: హిట్ కొట్టేస్తారు..!

Hyderabad: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’( Miss Shetty Mr Polishetty). రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్(UV creations) ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్​.

ఈ టీజర్‌లో అనుష్క పాపులర్​ షెఫ్‌గానూ, నవీన్ పోలిశెట్టిని స్ట్రగులింగ్ స్టాండప్ కమెడియన్‌గానూ చూడవచ్చు. అనుష్కకు పెళ్లి చేయడం తన తల్లికి అస్సలు ఇష్టం లేదు. అయితే అనుకోకుండా నవీన్ పోలిశెట్టి, అనుష్క కలవాల్సి వస్తుంది. వారి మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్‌ను ఈ టీజర్‌లో చూడవచ్చు. కానీ వీరిద్దరూ ప్రేమలో పడ్డారా లేదా అన్న విషయం మాత్రం రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారు. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘ఫుడ్​ ఏం మ్యాజిక్​ కాదు ఇట్స్​ సైన్స్​..’ అంటూ అనుష్క డైలాగ్​తో మొదలయ్యే ఈ టీజర్​ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. అనుష్క తల్లిగా జయసుధ, నవీన్​ తండ్రిగా మురళీ శర్మ కనిపించారు. కాగా, ఈ టీజర్​ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్​ చేశారు. బాహుబలి తర్వాత టాలీవుడ్​ ప్రేక్షకులను మెప్పించలేకపోయిన స్వీటీ ఈ సినిమాతో కచ్చితంగా ఆకట్టుకోనుందని తెలుస్తోంది.