Allu Arjun: ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ గురించి బయటపెట్టిన బన్నీ
Hyderabad: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) తన మొదటి గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పి అందరినీ సర్‌ప్రైజ్ చేసారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి (indian idol 2) చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బన్నీ.. శ్రుతి (shruti) అనే అమ్మాయి పాట పాడుతుంటే ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. దాంతో పక్కనే ఉన్న సింగర్ కార్తిక్ (karthik).. ఏంటి సర్ శ్రుతి పాడుతుంటే ఆమెనే చూస్తున్నారు అని అడగ్గా.. మీ పేరు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే అన్నారు. దాంతో అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. అంతేకాదు.. ఆ సింగర్‌కు బన్నీ స్టేజ్‌పైకి వెళ్లి మరీ గిఫ్ట్ ఇచ్చాడు. బన్నీ వచ్చిన సందర్భంగా అన్నీ ఆయన నటించిన సినిమాల్లోని పాటలు పాడటంతో బన్నీ కూడా ఫుల్ ఖుష్ అయిపోయారు. జై అనే సింగర్ పరుగు సినిమాలోని నమ్మవేమో గానీ పాట పాడటంతో నీ పేరుతోనే జై ఉంది నువ్వే విన్నర్ అని బన్నీ ప్రకటించేయడంతో ఇండియన్ ఐడన్-2 ఫినాలే రౌండ్ మరింత ఆసక్తికరంగా మారనుంది.