Allari Naresh: ప‌వ‌న్‌తో న‌టించే ఛాన్స్ కోసం వెయిటింగ్

Hyderabad: కామెడీ కింగ్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడిప్పుడు త‌న‌లో ఉన్న మ‌రో టాలెంట్‌ను ఆడియ‌న్స్‌కు చూపిస్తున్నారు అల్ల‌రి న‌రేష్‌(allari naresh). నాంది, మారేడుమిల్లి ప్ర‌జానీకం వంటి థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమాల‌తో మెప్పించి ఇప్పుడు ఉగ్రంతో(ugram) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న స‌ర‌దాగా ఫ్యాన్స్‌తో చాట్ చేసారు. ఆయ‌న ఫ్యాన్స్‌తో పంచుకున్న విష‌యాలేంటో చూద్దాం.

ఇక కామెడీ సినిమాలు చేయ‌రా అన్నా?
త‌ప్పకండా చేస్తా. నా త‌ర్వాతి సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ. బాగా ఎంజాయ్ చేస్తారు.

మహేష్ బాబుతో న‌టించ‌డం ఎలా అనిపించింది?
మ‌హ‌ర్షి సినిమా షూటింగ్ ఒక మెమొరీలా ఉండిపోతుంది.

ఉగ్రం వంటి మ‌రో సినిమాతో రావాలి అన్నా
త‌ప్ప‌కుండా

మ‌హేష్‌తో న‌టించేసారు.. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఎప్పుడు?
ఆ ఛాన్స్ కోసం నేనూ వెయిటింగ్

మీ నాన్న‌గారిలా డైరెక్ష‌న్ వైపు వ‌స్తారా?
ఇంకొన్నేళ్ల‌లో త‌ప్పకుండా

మీ ఫిట్నెస్ సీక్రెట్?
నో స్ట్రెస్

గ‌మ్యం మూవీ రీ రిలీజ్ చేయించండి అన్నా
త‌ప్ప‌కుండా ట్రై చేస్తా

విల‌న్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టిస్తారా?
ఉగ్రం చూసాక అలాంటి డైరెక్ట‌ర్స్ అలాంటి క్యారెక్ట‌ర్స్‌తో వ‌స్తారేమో చూడాలి.

ర‌వితేజ అన్న‌తో మ‌ళ్లీ ఎప్పుడు న‌టిస్తారు?
మ‌ళ్లీ శంభో శివ‌శంభో లాంటి సినిమా వ‌చ్చినప్పుడు. యాక్ష‌న్‌, కామెడీ ఉండాలి.