Samantha: ఫాలోవర్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్న సామ్.. డాక్టర్ మండిపాటు
Samantha: నటి సమంత తన ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఓ వైద్యుడు ఆరోపణలు చేసారు. ది లివర్ డాక్ పేరుతో ట్విటర్‌లో బాగా ఫేమస్ అయిన హెపటాలజిస్ట్.. సమంతను సైన్స్ తెలీని అజ్ఞాని అని మండిపడ్డారు. మయోసిటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఇటీవల ఓ హెల్త్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సామ్ సమాధానం చెప్పారు. అయితే లివర్ విషయంలో సామ్ కొన్ని వివరాలను చెప్పడంపై ఆ వైద్యుడు ఆవేదన వ్యక్తం చేసారు. అసలు సైన్స్ అంటే ఏంటి.. మనిషి శరీరం ఎలా నడుచుకుంటుంది అనే వివరాలు తెలీకుండానే ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒకరి అజ్ఞానాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటే షాకింగ్‌గా ఉంది. పైగా ఆ అజ్ఞానాన్ని తన 30 మిలియన్ ఫాలోవర్లకు కూడా చేరవేయడం బాధాకరం అని పేర్కొన్నారు.
“” ఈమె పేరు సమంత. లివర్‌ను డీటాక్స్ చేసే విషయంపై తన 30 మిలియన్ ఫాలోవర్లను చాలా సులువుగా తప్పుదోవ పట్టించారు. ఆకుల ద్వారా ఆటో ఇమ్యూన్ వ్యాధులు పోతాయని ఆ పాడ్‌కాస్ట్‌ని హోస్ట్ చేసిన వ్యక్తి చెప్పడం.. దానికి సమంత తల ఊపడం నిజంగా నాన్సెన్స్‌లా ఉంది. సైన్స్ గురించి తెలీని వారు వేరొకరిని గెస్ట్‌లా పిలిచి ఇంత చెత్తగా ఎలా మాట్లాడతారో నాకు ఇప్పటికీ అర్థంకావడంలేదు. సమంత పాడ్‌కాస్ట్ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన వ్యక్తి అసలు హెల్త్ కోచ్ కాదు.. వైద్యుడు అసలు కాదు. అలాంటిది వీరిద్దరూ కూర్చుని లివర్ ఎలా ఫంక్షన్ అవుతుందో చెప్తున్నారు.
డాండిలియాన్ పువ్వుతో లివర్ సమస్యలు దూరం అవుతాయని చెప్తున్నారు. డాండిలియాన్ అనేది కలుపు మొక్క లాంటిది. నేను ఓ లివర్ డాక్టర్‌ని. ఎందరో పేషంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను ఇంత వరకు డాండిలియాన్‌తో లివర్ సమస్యలు పోతాయని చదివింది లేదు. డాండిలియాన్‌ను సలాడ్స్‌లో వాడతారు. వీటి సప్లిమెంట్స్ ఎక్కడా దొరకవు. వీటి సప్లిమెంట్స్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. వచ్చినా వాటిని వేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి “”” అని మండిపడ్డారు ఆ లివర్ వైద్యుడు. దీనిపై సమంత నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
This is Samantha Ruth Prabhu, a film star, misleading and misinforming over 33 million followers on "detoxing the liver."
The podcast feature some random health illiterate "Wellness Coach & Performance Nutritionist" who has absolutely no clue how the human body works and has the… pic.twitter.com/oChSDhIbu2
— TheLiverDoc (@theliverdr) March 10, 2024