ఏ క‌ష్ట‌మూ రాకుండా ఉండాలంటే ఈ పూజ చేయండి

make your life smooth without problems with this puja

Puja: క‌ష్టాలు వ‌స్తే మ‌న‌కు దేవుడే దిక్కు. క‌ష్టాలు తీర్చు స్వామి అని కొంద‌రు.. ఆ క‌ష్టం తీర‌క‌పోయినా ధైర్యంగా ఎదుర్కొనే శ‌క్తిని ఇవ్వు అని మ‌రికొంద‌రు కోరుకుంటూ ఉంటారు. కష్టాలు వ‌చ్చాక దేవుడిని ఆరాధించ‌డం వేరు. మ‌రి ఆ కష్ట‌మ‌నేదే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆదివారం – ఆదిత్య హృద‌యం

సోమ‌వారం – ఈశ్వ‌రుడు

మంగ‌ళ‌వారం – ఆంజ‌నేయ స్వామి పూజ‌

బుధ‌వారం – సింధూర గ‌ణ‌ప‌తి

గురువారం – ద‌త్తాత్రేయుడు

శుక్ర‌వారం – మ‌హాల‌క్ష్మి

శ‌నివారం – వెంక‌టేశ్వ‌ర స్వామి

ఇలా ప్ర‌తి రోజూ ఏ రోజుకి సంబంధించిన పూజ ప‌ది నిమిషాల పాటు చేసుకున్నా ఆ ఇంట క‌ల‌హాలు, దుఖాలు ఉండ‌వు. ఒక‌వేళ స‌మ‌స్య‌లు ఉన్నా ధైర్యంగా ఎదుర్కోగ‌లిగే శ‌క్తి వ‌స్తుంది. కాక‌పోతే ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి.. అధ‌ర్మ మార్గంలో న‌డుస్తూ నేను పూజ‌లు చేస్తే నాకు ఏమీ జ‌ర‌గ‌దు. ఆ దేవుడు న‌న్ను ర‌క్షిస్తాడు అనుకుంటే మాత్రం అది పొర‌పాటే. ఎన్ని పూజ‌లు చేసినా ధ‌ర్మ‌మైన మార్గంలో న‌డవ‌క‌పోతే ఏ దేవుడూ ర‌క్షించ‌డు అని మాత్రం గుర్తుపెట్టుకోండి.