కామ‌ధేను ఫోటో ఇంట్లో ఉంటే క‌లిగే లాభాలు

benefits of keeping Kamadhenu photo at home

Kamadhenu: ఇంట్లో కామ‌ధేను ఫోటో కానీ విగ్ర‌హం కానీ పెట్టుకోవ‌డం వ‌ల్ల పూర్వ‌జ‌న్మ‌లో చేసిన పాపాలు తొల‌గిపోతాయంటారు. చాలా మంది కామ‌ధేను అంటే సాధార‌ణ ఆవు అనుకుంటారు. కామ‌ధేనువు క్షీర‌సాగ‌ర మ‌థ‌నం చేసిన‌ప్పుడు క‌ల్ప‌వృక్షం, కామ‌ధేనువు, ల‌క్ష్మీదేవి వంటి వ‌చ్చాయ‌ని పురాణాల్లో చెప్పారు. కామ‌ధేనువు అనేది ఉత్త‌మ‌మైన గోవు. కామధేనువు ఫోటో ఇంట్లో ఉండ‌టం వ‌ల్ల పూర్వ జ‌న్మ పాపాలు తొల‌గిపోతాయ‌నుకోవ‌డంలో అర్థంలేదు. ముందు కామ‌ధేనువు ల‌క్ష‌ణాలేంటో తెలుసుకోవాలి.

అన్నిటికంటే గోసేవ గొప్ప‌ది అంటుంటారు. గోవు ధ‌ర్మానికి ప్ర‌తీక. అంటే మ‌నిషి కూడా ధర్మ మార్గంలో న‌డవాలి. అయితే.. కామ‌ధేనువు ఫోటోను ఈశాన్యం వైపు పెడితే ఆ వ్య‌క్తి అధ‌ర్మం వైపు వెళ్ల‌కుండా ఉంటాడ‌ట‌. అధ‌ర్మం వైపు వెళ్ల‌క‌పోవ‌డం వ‌ల్ల పాపాలు చేయ‌రు. పాపాలు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆటోమేటిక్‌గా పుణ్యం పెరుగుతుంది. ఈ ర‌కంగా ధ‌ర్మ మార్గంల న‌డిస్తే పాపాలు చేయ‌కుండా పూర్వ జ‌న్మ క‌ర్మను జ‌యించ‌గ‌లుగుతామే త‌ప్ప కేవ‌లం కామ‌ధేను ఫోటోను ఇంట్లో పెట్టేసుకుని వాటంత‌ట అవే పాపాలు పోతాయి అనుకుంటే అది మూర్ఖ‌త్వం అని పెద్ద‌లు చెప్తున్నారు.