David Warner: మహేష్, బన్నీ ఉంటే విలన్‌గా చేస్తా
Hyderabad: మహేష్ బాబు(mahesh babu), అల్లు అర్జున్(allu arjun) హీరోలుగా చేస్తే.. అందులో నేను విలన్‌గా నటిస్తానని అంటున్నారు డేవిడ్ వార్నర్(david warner). టిక్‌టాక్ రిల్స్‌తో మన తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ తెలుగువారి మనసులు దోచుకున్నాడు వార్నర్(warner). దిల్లీ క్యాపిటల్స్(delhi capitals) స్కిప్పర్ అయిన వార్నర్.. ఐపీఎల్(ipl) సీజన్ సందర్భంగా సరదాగా మీడియాతో చిట్‌చాట్ చేసారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఏ హీరోలతో కలిసి నటించాలని ఉంది అని అడిగితే.. ఠక్కున మహేష్ బాబు(mahesh babu), అల్లు అర్జున్(allu arjun) పేర్లు చెప్పాడు. అంతేకాదు.. ఇందులో రష్మిక మందన(rashmika mandanna) హీరోయిన్‌గా నటించాలని కూడా అన్నాడు. వీరంతా సినిమాలో ఉంటే విలన్‌గా నటిస్తాడట. తనది మామూలుగానే విలన్ లాంటి స్వభావమని, ఇక బన్నీ మహేష్ ఉంటే చెలరేగిపోతానని చెప్పాడు డేవిడ్. ఇక పుష్ప సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్‌ని ఇమిటేట్ చేస్తూ వార్నర్ ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. దాంతో తెలుగు ఫ్యాన్స్ అంతా వార్నర్‌ను వార్నర్ మావా అంటూ ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు. కొందరైతే హైదరాబాద్ వచ్చేసి ఆధార్ కార్డుకు అప్లై చేస్కో వార్నర్ మావా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.