పాపాయికి పేరు పెట్టాలా.. ఈ అమ్మవారి పేర్లు చూడండి!
Hyderabad: ఆడపిల్ల(baby girl) పుట్టిందంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టినట్లే భావిస్తారు. నామకరణం(baby girl names) చేయాల్సిన సమయం వచ్చినప్పుడు బిడ్డ పుట్టిన తేదీ, నక్షత్రం వంటివి అన్నీ పరిశీలించి అన్ని విధాలా సరిపోయే పేరు పెడుతుంటారు కొందరు. అయితే.. ఇవేవీ చూడకుండా చక్కటి పేరు పెట్టాలనుకునేవారు.. అమ్మవారి పేర్ల నుంచి ప్రేరణ పొందిన ఈ నామధ్యేయాలను పరిశీలించండి. భారతదేశంలో అత్యధిక పూజలు అందుకునే అమ్మవారు దుర్గామాత(durga). దుర్గామాతకి ఎన్నో పేర్లు ఉన్నాయి.
ఆద్య(Aadya)
అంటే దుర్గా దేవి యొక్క ఆదిమ శక్తి అని అర్థం. అ,ఆ అక్షరాలతో పేర్లు పెట్టాలనుకుంటే ఆద్య అనే పేరు బాగుంటుంది.
భైరవి(Bhairavi)
భైరవి అనేది సంస్కృత పదం. అంటే ధైర్యవంతురాలు అని అర్థం.
జయ(Jaya)
జయ అంటే గెలుపు అని అర్థం. దుర్గా దేవి విజయ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
నిత్య(Nitya)
నిత్య అంటే దుర్గాదేవిలాగా శాశ్వతమైన స్వభావం కలిగినది అని అర్థం.
త్రిష్ణ(Trishna)
త్రిష్ణ అంటే ఆధ్యాత్మిక మేల్కొలుపు, జ్ఞానోదయం కోసం పరితపించేది అని అర్థం. ఈ పేరు కూడా వినడానికి పలకడానికి చక్కగా ఉంటుంది.
వారాహి(Varahi)
దుర్గా మాతకు ఉన్న మరో పేరు వారాహి. ఎల్లప్పుడూ రక్షించే స్వభావం కలది అని అర్థం.
వృంద(Vrinda)
వృంద అంటే సంస్కృతంలో తులసి అని అర్థం. తులసి మొక్కలాగా పవిత్రమైనది అన్న అర్థం వచ్చేలా ఈ పేరు పెడితే బాగుంటుంది.
చందిక(Chandika)
ఇది దుర్గాదేవి ఉగ్ర రూపాన్ని సూచించే పేరు.