Allu Arjun సూప‌ర్.. మా బాలీవుడ్‌కి అంత సీన్ లేదు

Hyderabad: అల్లు అర్జున్‌ని(allu arjun) తెగ పొగిడేస్తున్నారు న‌టి హేమ మాలిని(hema malini). బ‌న్నీ న‌టించిన పుష్ప(pushpa) సినిమాను రీసెంట్‌గా చూసార‌ట‌. అందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ కోసం త‌న ఫిజిక్‌ని మార్చుకున్న విధానం త‌న‌కెంతో నచ్చింద‌ని ఓ సంద‌ర్భంలో అన్నారు. “ఇటీవ‌ల పుష్ప చూసాను. నాకు చాలా న‌చ్చింది. అంద‌రూ అల్లు అర్జున్ డ్యాన్స్‌, మేన‌రిజాన్ని ఇమిటేట్ చేస్తూ రీల్స్ ఎందుకు చేస్తున్నారో అప్పుడు అర్థమైంది. పుష్ప చూసాక‌.. అర్జున్ న‌టించిన వేరే సినిమా చూసాను. అస‌లు అందులో అర్జున్‌కి పుష్ప‌లో అర్జున్‌కి పోలికే లేదు. ఒక సినిమా కోసం ఇంత స్ట్రిక్ట్‌గా త‌న‌ని తాను మౌల్డ్ చేసుకున్నాడంటే చిన్న విష‌యం కాదు. మా బాలీవుడ్ వాళ్ల‌కు అంత సీన్ లేదు. అస‌లు అలాంటి క్యారెక్ట‌ర్స్ కూడా చేయ‌రు. ఎవ‌రిదాకో ఎందుకు మా ఆయ‌న ధ‌ర్మేంద్ర ర‌జియా సుల్తాన్ సినిమాలో న‌ల్ల‌గా క‌నిపించాలని డైరెక్ట‌ర్ చెప్పాడు. ఆయ‌న దానికే తెగ సిగ్గుప‌డిపోయి చేయ‌లేక‌పోయాను” అని తెలిపారు హేమ‌.