Pawan Kalyan: స్టార్‌డం సంపాదించుకున్నా.. CM ప‌ద‌వీ సంపాదించుకుంటా

AP: సీఎం ప‌ద‌వి అనేది అడిగి తీసుకునేది కాద‌ని సత్తా చాటి ద‌క్కించుకోవాల‌ని అన్నారు జ‌నసేన(janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(pawan kalyan). రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్య‌టించిన త‌ర్వాత ఆయ‌న ప్రెస్ మీట్లో మాట్లాడారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసొచ్చే పార్టీల‌తో క‌లిసి పొత్తుపెట్టుకుంటాన‌ని, పొత్త‌ల వ‌ల్లే చాలా పార్టీలు బ‌ల‌ప‌డ్డాయ‌ని అన్నారు. ఇప్పుడు చాలా మంది తానే త‌ర్వాతి సీఎం అంటున్నార‌ని, అలా ప‌ద‌వి అడిగి తీసుకోవ‌డం త‌న‌కు న‌చ్చ‌ద‌ని తెలిపారు. “వైసీపీని త‌రిమికొట్టే పార్టీల‌తోనే పొత్తుపెట్టుకుంటాం. సీఎం అయితేనే వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని అంటున్నారు. నేను అలా అనుకోను. ప‌దవులు అడిగి తీసుకోకూడ‌దు, మ‌న స‌త్తా చాటి ద‌క్కించుకోవాలి. నాకు సినిమాలో స్టార్‌డం ఎవ్వ‌రూ ఇవ్వ‌లేదు. నేను సంపాదించుకున్నాను. సీఎం ప‌ద‌విని కూడా అలాగే సంపాదించుకుంటా” అన్నారు.