Shobita Dhulipala: ఆ రూమ‌ర్స్‌కి రిప్లై ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు

Hyderabad: కొద్దిరోజులుగా టాలీవుడ్​ హీరో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభితా ధూళిపాల(Shobita Dhulipala) డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పైగా లండన్(London) లో వీరిద్దరూ షికారు చేసిన ఫొటోలు, అంతకు ముందు ఎఫ్1 రేస్(F1 Race) సందర్భంగా ఇద్దరూ కలిసి దిగిన పిక్స్ కూడా వైరల్ గా మారాయి. ఇన్నాళ్లూ తమ రిలేషన్​ గురించి అటు నాగచైతన్యగానీ, ఇటు శోభితగానీ స్పందించలేదు. కాగా, తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న తనపై, నాగచైతన్యతో తన రిలేషన్​పై వస్తున్న రూమర్స్​పై పరోక్షంగా కామెంట్స్​ చేసింది.

శోభిత తెలుగమ్మాయే అయినప్పటికీ తన కేరీర్ బాలీవుడ్ లోనే మొదలు పెట్టింది. ‘రామన్ రాఘవ్ 2.0’తో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్2’(PS2)తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ‘గూఢచారి’(Goodachari) సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సౌత్​లోనూ అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలోనూ శోభితా యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తాజాగా తనపై వస్తున్న రూమర్స్​పై మాట్లాడుతూ..  ‘నాపై రూమర్స్ ఎక్కువగా రాలేదనే అనుకుంటున్నా. ఎవరో ఒకరు తెలిసీ తెలియక మాట్లాడిన వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. నా తప్పులేకుండా వచ్చిన వార్తలకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. రీసెంట్ గా మణిరత్నం(Mani Ratnam) దర్శకత్వంలోని ‘పొన్నియిన్ సెల్వన్’లో నటించాను. పైగా నాలుగు పాటలకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతానికి డాన్స్ చేయడం అద్భుతమైన ఫీలింగ్ ని ఇచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవితంతో ముందుకు సాగాల్సిందే. అనవసరమైన వాటిపై ఆలోచించాల్సిన పన్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.