ఆలియా భట్​ కొత్త ఇల్లు.. విలువెంతో తెలుసా?

Mumbai: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ (Alia Bhatt) జీవితం హాయిగా సాగిపోతోంది. ప్రేమించిన రణబీర్ (Ranbir Kapoor) ను వివాహం చేసుకుంది. ఇటీవలే ఒక పాపకు తల్లి అయ్యింది. ప్రస్తుతం తల్లిగా కూడా ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి చేసుకుని, తల్లి అయిన తర్వాత కూడా సినిమాల విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించలేదు అలియా. అయితే, కథల ఎంపికలో మాత్రం మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

ఇక తాజాగా ఆలియా.. భారీ ధరకు కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని టాక్. ఇప్పటికే ముంబైలో రణబీర్ తో కలిసి ఉంటున్న ఇల్లు కాకుండా.. ఆమె మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని దాని విలువ రూ. 37 కోట్లు అని టాక్ నడుస్తోంది. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యిందని సమాచారం. స్టాంప్ డ్యూటీ కోసమే దాదాపు 3 కోట్ల వరకు ఖర్చయినట్టు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అలియా పేరు మీద ఇప్పటికే మూడు విల్లాలు ఉన్నాయి. అవి కూడా దాదాపు 8 కోట్లు విలువ చేస్తాయి. అయితే వాటిని ఈ ముద్దుగుమ్మ తన సోదరికి గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇప్పుడు కొనుగోలు చేసిన ఇల్లు కాకుండా రణబీర్ తో కలిసి ఉండడానికి అలియా ఒక డ్రీమ్ హౌస్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమ అభిరుచులకు తగ్గట్టు ఆ ఇంటిని నిర్మించుకుంటున్నారు ఈ క్యూట్ కపుల్. అయితే, ఇంత భారీగా ఖర్చు ఆలియా ఇల్లు ఎందుకు కొనుగోలు చేసిందని అనుకుంటున్నారు పలువురు. అయితే అలియా ఈ మధ్యనే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ ఆఫీస్ కోసమే ఈ ఇల్లు కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.