Sampath Ram: కన్న‌డ న‌టుడు సంప‌త్ రామ్‌ ఆత్మ‌హ‌త్య‌

Bengaluru: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు సంప‌త్ రామ్(sampath ram) ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. క‌ర్ణాట‌క‌లోని నేల‌మంగ‌ళ ప్రాంతంలోని ఆయ‌న నివాసంలో ఆయ‌న మృత‌దేహం ల‌భ్య‌మైంది. సంప‌త్ రామ్ వ‌య‌సు 35 ఏళ్లు. అగ్నిసాక్షి, శ్రీ బాలాజీ ఫొటో స్టూడియో వంటి ఎన్నో సీరియ‌ళ్లు, సినిమాల్లో న‌టించారు సంపత్. ఆయ‌న స్నేహితుడు రాజేశ్ ధృవ సంప‌త్ చ‌నిపోయిన విష‌యాన్ని ఫేస్‌బుక్ ద్వారా వెల్ల‌డించారు. నువ్వు వెళ్లిపోవ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నాం. ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. నీ క‌ల‌లు తీర‌డానికి ఇంకా ఎంతో స‌మయం ఉంది. ప్లీజ్ వెన‌క్కి రా అంటూ ఉద్వేగభ‌రిత‌మైన పోస్ట్ పెట్టారు. స‌రైన ఆఫ‌ర్లు రాక‌పోవ‌డంతో సంప‌త్ మ‌న‌స్తాపానికి గుర‌య్యాడ‌ని, కానీ ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతుంద‌ని అస్స‌లు ఊహింలేదని సంప‌త్ స‌హ న‌టుడు సూర్య మీడియాతో చెప్పారు. నిన్న ఆయ‌న స్వ‌స్థ‌లం అయిన ఎన్ ఆర్ పుర ప్రాంతంలో సంప‌త్ అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి.