Vishal 34: మరో సినిమా షురూ చేసిన విశాల్​!

Chennai: కోలీవుడ్​ స్టార్​ హీరో విశాల్​(Vishal) పోయినేడాది లాఠీ(Lathi) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. కోలీవుడ్​ డైరెక్టర్​ హరి(Hari) దర్శకత్వంలో కొత్త సినిమాకు ఈరోజే పూజా కార్యక్రమాలు చేసి మొదటి క్లాప్​ కొట్టినట్టు సమాచారం.

విశాల్‌ 34 ఇవాళ పూజా కార్యక్రమాలతో షురూ అయింది. విశాల్‌ 34 (Vishal 34)‌గా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తుండగా.. మధ్యలో స్టెతస్కోప్‌ చూడొచ్చు. విశాల్ ఇందులో డాక్టర్‌గా కనిపించబోతున్నట్టు తాజా లుక్‌తో అర్థమవుతోంది. మాస్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తాజా ప్రాజెక్ట్‌ ఉండబోతున్నట్టు హింట్‌ ఇచ్చేశాడు డైరెక్టర్ హరి. భరణి, పూజ సినిమాల తర్వాత హరి దర్శకత్వంలో విశాల్‌ నటిస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.

స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్​, ఇతర నటీనటులు వివరాలు తెలియాల్సి ఉంది.  త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది.