“బిడ్డ‌కు తండ్రి ఎవరు”.. ఇలియానా సైలెన్స్‌కి కార‌ణం?

Hyderabad: గోవా బ్యూటీ ఇలియానా(ileana) త‌ల్లికాబోతున్నారు. ఈ గుడ్‌న్యూస్‌ని(ileana pregnant) నిన్న ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసింది. మ‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. కొన్నేళ్ల క్రితం ఆమె ఆస్ట్రేలియ‌న్ ఫొటోగ్రాఫ‌ర్‌తో ప్రేమ‌లో ఉంది. ఆ త‌ర్వాత కొన్ని ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల బ్రేకప్ అయింది. ఈ మ‌ధ్య‌కాలంలో బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ బ్ర‌ద‌ర్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉంది. ఈ విష‌యాన్ని క‌త్రినా కూడా ఓసారి బ‌య‌టికి చెప్పింది. ఈ నేప‌థ్యంలో ఇలియానా త‌ల్లికాబోతుండ‌డం అనేక సందేహాల‌కు దారితీస్తోంది. ఇది ఆమె వ్య‌క్తిగ‌త విష‌యం అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది నెటిజ‌న్లు “తండ్రి ఎవ‌రు? పెళ్లి చేసుకున్నావా? స‌రోగ‌సీనా?” అంటూ చెత్త కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇలియానా ఇలాంటి కామెంట్స్ అస్స‌లు స‌హించ‌దు. డైరెక్ట్‌గానైనా ఇన్‌డైరెక్ట్‌గానైనా స‌మాధానం చెప్పి నోరు మూయిస్తుంది.

ఎందుకంటే.. 2016లో ఇలాగే ఇలియానాకు ఓ నెటిజ‌న్ నుంచి ద‌రిద్ర‌మైన ప్ర‌శ్న ఎదురైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజ‌న్స్‌తో చాట్ చేస్తుండ‌గా.. ఓ వ్య‌క్తి మీరు వ‌ర్జినా అని అడిగాడు. దాంతో ఇలియానాకు ఒళ్లు మండిపోయింది. మీకు చాలా తెలుసుకోవాల‌ని ఉన్న‌ట్టుంది. ఇదే విషయం మీ అమ్మ‌ను అడిగి చూడండి అని ఆన్స‌ర్ ఇచ్చింది. అలాంటిది ప్రెగ్నెన్సీ విష‌యంలో ఎంత మంది ఎన్ని ర‌కాలుగా కామెంట్లు, ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నా ఇలియానా సైలెంట్‌గానే ఉంది. అందుకు కార‌ణ‌మేంటో ఆమెకే తెలియాలి మ‌రి. ఏదేమైన‌ప్ప‌టికీ.. ఒక‌ప్పుడు తెలుగు కుర్రాళ్ల మ‌న‌సు దోచుకున్న మ‌న ఇలియానా పండండి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుందాం.