Samantha: కర్మణ్యే వాధికారస్తే….

Hyderabad: టాలీవుడ్ హీరోయిన్ సమంత(Samantha) నటించిన తాజా చిత్రం శాకుంతలం (Shaakuntalam). మైథ‌లాజిక‌ల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని డైరెక్టర్​ గుణశేఖర్(Guna Shekar) తెరకెక్కించారు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రచన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ  సినిమాలో సమంత శకుంతల పాత్ర, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్ర పోషించారు. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్(Allu Arjun) కూతురు అల్లు అర్హ(Allu Arha) ఈ సినిమాలో నటించి వెండితెర అరంగేట్రం చేసింది. దిల్ రాజు(Dil Raju) సమర్పణలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘోరంగా విఫలమైంది.

కాగా తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ’ అని రాసుకొస్తూ ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ వ్యాఖ్యలు అర్ధం ఏంటంటే.. ‘నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి’. ఇది చూసిన నెటిజన్లు శాకుంతలం రిజల్ట్ గురించే సమంత ఈ పోస్ట్ చేసింది అంటున్నారు.

ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ‘గో ఫార్‌వార్డ్ సమంత’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) కలిసి ఖుషీ సినిమాలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు.