గెడ్డం లేని అబ్బాయిలే కావాలంటూ అమ్మాయిల ధ‌ర్నా

indore girls protesting for beard less boy friends

Indore: కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే స‌మాజం ఎటుపోతోంది అన్న ప్ర‌శ్న వేసుకోక త‌ప్ప‌దు. ఓ ప‌క్క క‌లక‌త్తాలో హ‌త్యాచారానికి గురైన వైద్యురాలికి న్యాయం జ‌ర‌గాలంటూ యువ‌త ధ‌ర్నాలు, నిరాహార దీక్ష‌లు చేప‌డుతుంటే.. మ‌రోప‌క్క మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో గెడ్డం లేని అబ్బాయిలే కావాలంటూ అమ్మాయిలు ధ‌ర్నా చేప‌డుతున్నారు. గెడ్డం లేని అబ్బాయిలే కావాలి. గెడ్డం కావాలో అమ్మాయి కావాలో మీరే తేల్చుకోండి అని ప్ల‌కార్డుల‌పై రాసి మ‌రీ ఇండోర్ రోడ్లపై ధ‌ర్నా చేప‌ట్టారు. కొంద‌రేమో ఏదో స‌ర‌దాకి చేసుంటారు అంటుంటే మ‌రికొంద‌రేమో రీల్స్ కోసం చేసార‌ని కామెంట్స్ పెడుతున్నారు.