OG: గ్యాంగ్‌స్ట‌ర్ మొద‌లెట్టేసాడు..!

Hyderabad: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్(pawan kalyan) ఫ్యాన్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఓజీ(OG) మొద‌లైపోయింది. సాహో(saaho) ఫేం సుజీత్(sujeeth) ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ఈరోజు మొద‌లైంద‌ట‌. ఈ విష‌యాన్ని టీం ప్ర‌క‌టిస్తూ ఫైర్‌స్టార్మ్ ఈజ్ క‌మింగ్(firestorm is coming) టైటిల్‌తో షూట్ స్టార్ట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ సినిమాకు థ‌మ‌న్(thaman) సంగీతం అందిస్తున్నారు. ఫైర్‌స్టార్మ్ ఈజ్ క‌మింగ్ వీడియోలో థ‌మ‌న్ BGM అద‌ర‌గొట్టేసారు. షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయిపోయింది. వ‌చ్చే వారం ప‌వ‌న్ సెట్స్‌లో అడుగుపెడ‌తార‌ట‌. ఇందులో పవ‌న్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహ‌న్(priyanka arul mohan) న‌టిస్తున్నట్లు టాక్‌.