రెండు గ్లాసుల నీళ్లు.. కొవ్వు ఇట్టే కరిగిపోద్ది
Health: ఏదన్నా తినడానికి ముందు రెండే రెండు గ్లాసుల నీళ్లు తాగితే కొవ్వు ఇట్టే కరిగిపోతుందట. అదెలా సాధ్యం? ఇలా నిజంగా వర్కవుట్ అవుతుందా? తెలుసుకుందాం.
తినడానికి ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగే పద్ధతిని వాటర్ ట్రిక్ అంటారట. ఇలా తాగడం వల్ల ఆల్రెడీ నీటితో కడుపు నిండిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినలేం. ఎక్కువగా తినకపోతే కేలొరీలు తగ్గుతాయి. కేలొరీలు తగ్గితే బరువు తగ్గుతారు. అయితే ఈ వాటర్ ట్రిక్‌ని ఇంట్లో పాటించడం కంటే బయటికి వెళ్లినప్పుడు పాటించడం మరీ మంచిది. ఎందుకంటే ఇంట్లో కంటే బయటకి వెళ్లి తినేటప్పుడే కంట్రోల్ లేకుండా తినేస్తాం.
తినే సమయంలో నీళ్లు తాగకూడదు అంటారు. నిజానికి ఈ మాటలో పెద్దగా లాజిక్ లేదు. తినేటప్పుడు నీళ్లు తాగినా తాగకపోయినా కడుపులోకి వెళ్లే ఫుడ్ దాని పని అది చేసుకుపోతుంది. ఒకవేళ తినేటప్పుడు మీకు నీళ్లు తాగే అలవాటు ఉంటే అది మంచిదే. అలవాటు లేకపోయినా మంచిదే. ఒబెసిటీ అనే మ్యాగజీన్‌లో ప్రచురించబడిన ఓ ఆర్టికల్ ప్రకారం.. తినడానికి ముందు 500 మిల్లీలీటర్ల నీళ్లు తాగితే ఆకలి కాస్త మందగిస్తుంది. దీని వల్ల ఎటూ తక్కువ తింటాం కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
12 వారాల పాటు చేపట్టిన ఈ సర్వేల్లో తినడానికి ముందు నీళ్లు తాగిన వారితో పోలిస్తే తాగని వారు ఎక్కువగా తినేయడం వల్ల కాస్త బరువు పెరిగినట్లు.. తాగిన వారు తక్కువగా తినడం వల్ల కొన్ని కిలోలు తగ్గినట్లు నిరూపితమైంది. అయితే ఈ వాటర్ ట్రిక్‌తో మాత్రమే బరువు తగ్గాలనుకోవడం పొరపాటు. దీంతో పాటు మంచి డైట్, వ్యాయామాలు కూడా చేస్తుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వాటర్ ట్రిక్ పెద్దలకు మాత్రం పనికి రాదు. ఇలాంటి విషయాల్లో మరింత అవగాహన కోసం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి అని గుర్తుంచుకోండి.