Hanuman: భయానికే వణుకు పుట్టించే 12 నామాలు
Hanuman: ఆంజనేయస్వామికి సంబంధించిన 12 అద్భుతమైన నామాలు ఉన్నాయి. ఈ నామాలకు భయాన్ని చూస్తేనే వణుకు. అంటే ఈ నామాలు మనకు ఎంత రక్షణ, శక్తిని ఇస్తాయో మాటల్లో చెప్పలేం.
12 నామాలు ఇవే
హనుమాన్
అంజనా సూనుః
వాయుపుత్రో
మహాబలః
రామేష్టః
ఫల్గుణసఖః
పింగాక్షో
అమితవిక్రమః
ఉదధిక్రమణశ్ఛైవ
సీతాశోకవినాశకః
లక్ష్మణ ప్రాణదాతా చ
దశగ్రీవస్య దర్పహా
ఆ నామాలకు అర్థాలివే
హనుమాన్ – హను అంటే దవడ. ఆంజనేయుడు చిన్నప్పుడు ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు బుజ్జి హనుమాన్ దవడ వాచిపోయింది. 12 నామాల్లో హనుమాన్ అనే నామమే ఎందుకు మొదటగా పెట్టారంటే.. విశ్వంలో హనుమంతుడికి జరిగిన ప్రమాదం ఎవ్వరికీ జరగలేదు అని.
అంజనా సూనుః
వాయుపుత్రో – అంజనాదేవి కుమారుడు వాయుపుత్రడు అని అర్థం
మహాబలః – గొప్ప బలం గలవాడు.
రామేష్టః – అన్నింటి కన్నా ఇష్టమైన నామం రామ. 12 పేర్లలో ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాడో లేదో తెలీదు కానీ రామేషః అనగానే చిరునవ్వు చిందిస్తాడట. అందుకే రామ నామం రాముడి పూజలు జరుగుతున్నప్పుడు కోతి రూపంలో వచ్చేస్తుంటాడు.
ఫల్గుణసఖః – అర్జునుడి ప్రాణ స్నేహితుడు
పింగాక్షో – శివుని అవతారం
అమితవిక్రమః – గొప్ప పరాక్రమం కలవాడు
ఉదధిక్రమణశ్ఛైవ
సీతాశోకవినాశకః – ఈ రెండు నామాలకు అర్థం సముద్రాన్ని లంగించినవాడు.. సీతాదేవి శోకాన్ని తీర్చినవాడు
లక్ష్మణ ప్రాణదాతా చ – సంజీవని తెచ్చి లక్ష్మణుడికి ప్రాణం పోసినవాడు
దశగ్రీవస్య దర్పహా – రావణాసురుడి అహంకారాన్ని అణిచినవాడు
మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు.. లేదా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు చదువుకుంటే ప్రయాణాల్లో ఆపదలు రాకుండా ఉంటాయి. చిన్న పిల్లలు రాత్రిళ్లు పడుకోకుండా ఏడుస్తున్నా.. పీడకలలు వస్తున్నా కూడా ఈ నామాలు చదువుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తాయి.