Chitti Babu: డైరెక్ట‌ర్‌తో ప‌డుకుంటే అవ‌కాశ‌మివ్వ‌రు.. అందంగా ఉంటే ఇస్తారు

Chitti Babu slams poonam kaur

Chitti Babu: న‌టి పూన‌మ్ కౌర్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌పై షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ వ‌ల్లే త‌న‌కు కెరీర్ లేకుండాపోయింద‌ని.. గ‌తంలో అత‌నిపై ఫిర్యాదు చేసినందుకు రాజ‌కీయంగా టార్చర్ చేసార‌ని ఆరోపించింది. పైగా త్రివిక్ర‌మ్‌తో మాట్లాడితే నువ్వు బ‌తికి ఉండ‌టం వ‌ల్ల ఎవ్వ‌రికీ ఉప‌యోగం లేదు. చ‌నిపో అని ధూషించాడ‌ని కూడా ఆరోపించింది. ఇటీవ‌ల ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌ను అత్యాచారం కేసులో అరెస్ట్ చేయ‌డంతో ఆయ‌న్ను జ‌న‌సేన పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ను కూడా ప్ర‌శ్నించాలంటూ పూన‌మ్ కౌర్ చేసిన ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ నిర్మాత చిట్టిబాబు పూన‌మ్ కౌర్ గురించి షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు. ఆమె అంతట ఆమె అందంగా ఉన్నానంటే స‌రిపోద‌ని.. కెమెరాలో లైటింగ్‌లో అందంగా క‌నిపిస్తేనే సినిమాల్లో తీసుకుంటార‌ని తెలిపారు. “” సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్స్‌లో ఏద‌న్నా స‌మ‌స్య‌లు వ‌స్తే చూసుకోవ‌డానికి మాత్ర‌మే మా అసోసియేష‌న్ ఉంది. అంతేకానీ ఫ‌లానా నిర్మాత, ద‌ర్శ‌కుడు సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌లేద‌నో లేదా మోసం చేసార‌నో ఫిర్యాదులు చేస్తే అవి మాకు సంబంధం లేదు. ఇక లైంగిక ఆరోప‌ణ‌ల విషయంలో కూడా ఫిర్యాదులు వ‌చ్చాయి కానీ వాటిని వెంట‌నే ప‌రిష్క‌రించేసాం. ఒక‌టో రెండో త‌ప్పుడు కేసులు వ‌చ్చాయి. కావాల‌ని త‌ప్పుడు కేసులు కూడా పెడుతుంటారు. ఇలాంటి త‌ప్పుడు కేసులు పెట్టేది కూడా నార్త్ నుంచి వ‌చ్చిన హీరోయిన్లే. వాళ్లు ముంబైలో ఉంటే కేవ‌లం జూనియ‌ర్ ఆర్టిస్ట్‌లుగా ఉంటారు. వారిని టాలీవుడ్‌లోకి తీసుకొచ్చాక కాస్త పేరు తెచ్చుకోగానే నాకు తెలుగంటే ఇష్టం అనే డైలాగులు చెప్తారు.

పూన‌మ్ కౌర్ కూడా తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. ఎప్పుడో మూడు నెల‌ల‌కోసారి నిద్ర నుంచి లేచి ట్విట‌ర్‌లో పోస్ట్‌లు పెడుతుంటుంది. వ‌చ్చి నీ స‌మ‌స్య చెప్పు అని మేం అడిగితే ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా రాలేదు. నాకెందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు ఆ హీరోయిన్ నాకంటే బాగుందా అనుకుంటారు. వేరే హీరోయిన్‌కి అవ‌కాశం ఇస్తే డైరెక్ట‌ర్ బెడ్‌రూంలోకి వెళ్లింది కాబ‌ట్టే అవ‌కాశం ఇచ్చారు అని మాట్లాడ‌తారు. కానీ ముఖం బాగుంటేనే కెమెరాకి అందంగా క‌నిపిస్తేనే హీరోయిన్లకు అవ‌కాశం ఇస్తారు కానీ ద‌ర్శ‌కుల బెడ్‌రూంలోకి వెళ్తే కాదు అన్న విష‌యం తెలుసుకోవాలి. ఆమెకు ఆమె అందంగా ఉన్నానంటే కుద‌ర‌దు. కెమెరా లైటింగ్‌లోనూ అందంగా కనిపిస్తేనే అవ‌కాశాలు వ‌స్తాయి. ఇప్ప‌టికైనా మించిపోయింది లేదు. పూన‌మ్ కౌర్ ధైర్యంగా బ‌య‌టికి వ‌చ్చి ఫిర్యాదు చేస్తే త‌ప్ప‌కుండా న్యాయం జ‌రిగేలా చూస్తాం “” అన్నారు.

దీనిపై పూన‌మ్ కౌర్ స్పందించారు. “” అంద‌రూ న‌న్ను ప్ర‌శ్నించేవారే. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ని మాత్రం ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌రు. దమ్ముంటే వెళ్లి త్రివిక్ర‌మ్‌ని ప్ర‌శ్నించు. మీలాగా నేను బుర్ర‌లేని దాన్ని కాదు ఇలాంటి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసి పాపులారిటీ సంపాదించుకోవడానికి “” అని మండిప‌డ్డారు.

ఇదే చిట్టిబాబు అనే నిర్మాత గ‌తంలో స‌మంత‌పై కూడా కామెంట్స్ చేసారు. స‌మంత కెరీర్ ఇక ముగిసిపోయిందంటూ వ్య‌క్తిగ‌త అంశాల‌పై మాట్లాడ‌టంతో స‌మంత త‌న‌దైన శైలిలో స‌మాధాన‌మిచ్చింది.