విమానంలో పాడు సినిమా.. ఇబ్బందిప‌డిన ప్ర‌యాణికులు

adult movie played in flight

Flight: విమానంలో లాంగ్ జ‌ర్నీ చేసే ప్ర‌యాణికుల కోసం సినిమాలు వేస్తుంటారు. వాళ్లు ఏది వేస్తే అది చూడాలి. క‌నీసం మ‌న‌కు న‌చ్చింది చూసుకునేందుకు ఆప్ష‌న్ కూడా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్‌కి చెందిన ఓ విమానంలో పొర‌పాటున అడ‌ల్ట్ సినిమా ప్లే చేసేసారు. ఆ స‌మ‌యంలో విమానంలో పిల్ల‌లు, మ‌హిళ‌లు, పెద్ద‌వాళ్లు కూడా ఉన్నారు. దాంతో అంతా ఎంతో ఇబ్బందిప‌డ్డారు. క‌నీసం ఆప‌మ‌ని చెప్పే ఆప్ష‌న్ కూడా లేదు. ఆస్ట్రేలియా నుంచి జ‌పాన్‌కు వెళ్తున్న కాంటాస్ విమానంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 2023లో వ‌చ్చిన డాడ్డియో అనే సినిమాను విమానంలో వేసారు. ఈ సినిమాలో న‌గ్న, సెక్సువ‌ల్ స‌న్నివేశాలు చాలా ఉన్నాయి. సాంకేతిక లోపం కార‌ణంగా అడ‌ల్ట్ సినిమా ప్లే అయ్యింద‌ని సిబ్బంది ప్ర‌యాణికుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

ఈ ఘ‌ట‌న గురించి ఆ విమానంలో ప్ర‌యాణించిన ఓ వ్య‌క్తి సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసాడు. క‌నీసం లైట్ ఆఫ్ చేయ‌డానికి, సినిమాను ఆఫ్ చేయ‌డానికి ఇలా ఎలాంటి ఆప్ష‌న్లు త‌మ‌కు లేవ‌ని.. చాలా ఇబ్బందిప‌డ్డామ‌ని తెలిపాడు. దాదాపు గంట సేప‌టి వ‌ర‌కు ఆ పాడు సినిమా డైలాగులు వినాల్సి వ‌చ్చింద‌ని.. గంట త‌ర్వాత వేరే సినిమా వేసార‌ని వెల్ల‌డించాడు. ఇంకెప్పుడూ కాంటాస్ విమానాల్లో తాను ప్ర‌యాణించ‌న‌ని తెలిపాడు.