Devara Collections: దేవ‌ర ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

devara first day collections

Devara Collections: జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా నిన్న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయ్యింది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా తొలి రోజు మంచి టాక్ అందుకుంది. ఇక‌ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ల ఓ లుక్కేస్తే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి రోజు దేవ‌ర రాబ‌ట్టిన వ‌సూళ్లు రూ.130 కోట్లు. దేవ‌ర ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు అస‌లు తొలి రోజు రూ.100 కోట్లు రాబ‌డుతుందా అనే సందేహాలు వ్య‌క్తం అయ్యాయి. కానీ అలాంటి సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ తార‌క్ రికార్డు నెల‌కొల్పారు.

తార‌క్‌కు ఇలాంటి రికార్డులు కొత్తేం కాదు. కొర‌టాల శివ‌కు ఈ హిట్ చాలా అవ‌స‌రం. ఎందుకంటే ఆచార్య డిజాస్ట‌ర్ త‌ర్వాత కొర‌టాల శివ తీసిన సినిమా దేవ‌ర‌. ఆ డిజాస్ట‌ర్ త‌ర్వాత దేవ‌ర‌తో కొర‌టాల మ‌ళ్లీ ట్రాక్‌లో ప‌డ్డార‌నే చెప్పాలి. అమెరికాతో పాటు ఇత‌ర అంత‌ర్జాతీయ మార్కెట్లలో దేవ‌ర రాబట్టిన క‌లెక్ష‌న్లు దాదాపు రూ.45 కోట్లు. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రూ.65 కోట్లు, తెలంగాణ‌లో రూ.67 కోట్లు రాబ‌ట్టింది. కర్ణాట‌క మార్కెట్‌లో రూ.10కోట్లు రాబ‌ట్టిన దేవ‌ర‌.. ఇత‌ర నార్త్ మార్కెట్ల‌లో రెండంకెల లాభాలు రాబ‌ట్టింది.