Jagan: తిరుమ‌ల‌కు జ‌గ‌న్

jagan to visit tirumala

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తిరుమ‌ల‌కు వెళ్ల‌నున్నారు. ఈనెల 28న ఆయ‌న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోనున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ వివాదంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కానీ త‌న ప్ర‌భుత్వ హ‌యాంలో కానీ ఎలాంటి త‌ప్పు జ‌ర‌గ‌లేద‌ని తెలియ‌జేసేందుకు జ‌గ‌న్ తిరుమ‌ల వెళ్ల‌నున్నారు. అదే రోజున పార్టీ నేతలు, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా త‌మ ద‌గ్గ‌ర్లోని ఆల‌యాల‌కు వెళ్లి పూజ‌లు చేయాల‌ని పిలుపునిచ్చారు.

“” తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది “” అని ట్వీట్ చేసారు.