Nandi: శివుడి ఆజ్ఞ‌తో ప‌క్క‌కు జ‌రిగిన నంది

special nandi and shiva temple

Nandi: ప్ర‌తి శివాల‌యంలో శివ‌య్య విగ్ర‌హానికి ఎదురుగా నంది ఉంటుంద‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అయితే.. ఈ శివాలయంలో మాత్రం నంది ఓ ప‌క్క‌కు ఒరిగి ఉంటుంద‌ట‌. శివుడు ఆజ్ఞాపించ‌డంతో నంది ప‌క్క‌కు జ‌రిగింద‌ని చెప్తుంటారు. ఇంత‌కీ ఈ ఆల‌య విశేషాలేంటో తెలుసుకుందాం.

త‌మిళ‌నాడులోని తిరుపుంగూరులో ఉంది ఈ ఆల‌యం. ఈ ఆల‌యం పేరు శివ‌లోక‌నాథ‌ర్. ఇంత‌కీ ఈ ఆల‌య విశిష్టత ఏంటంటే.. నంద‌నార్ అనే ద‌ళిత భ‌క్తుడిని పూజారులు లోనికి రానివ్వ‌క‌పోవ‌డంతో.. ఆ భ‌క్తుడు ఆల‌యం బ‌య‌టి ద్వారం నుంచే క‌న్నీరు కారుస్తూ శివ‌య్య‌ను ఆరాధించాడ‌ట‌. అప్పుడు శివ‌య్యకు నంద‌నార్ క‌నిపించ‌లేదు. ఇందుకు కార‌ణం ఆయ‌న ఎదురుగా నంది అడ్డుగా కూర్చుని ఉంది. దాంతో.. నందీ ప‌క్క‌కు జ‌రుగు ఆ భ‌క్తుడు నాకు కాన‌రావ‌డంలేదు అని చెప్ప‌డంతో శివుడి ఆజ్ఞ మేర నంది ఓ ప‌క్క‌కు ఒరిగి ఉంటుంది.