Vishwak Sen: తార‌క్ అన్న అందం గురించి నువ్వే మాట్లాడాలి

vishwak sen slams a youtuber who trolled jr ntr looks in devara

Vishwak Sen: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర సినిమా ట్రైల‌ర్ మొన్న రిలీజ్ అయ్యి సినిమాపై అమాంతం ఎక్స్‌పెక్టేష‌న్స్ పెంచేసింది. ఇక ట్రైల‌ర్ రిలీజ్ అవ్వ‌గానే కొంద‌రు యూట్యూబ్ క్రిటిక్స్ దేవ‌ర ట్రైల‌ర్ ఎలా ఉందో తెగ వివ‌రించేస్తున్నారు. అయితే.. ఓ యూట్యూబ‌ర్ దేవ‌ర‌లో ఎన్టీఆర్ లుక్స్ అంత‌గా బాలేవ‌ని కామెంట్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. ఈ కామెంట్ విశ్వ‌క్ సేన్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న మండిప‌డ్డారు.

“” నాపేరు చెడ‌గొట్ట‌డానికే పుట్టిన‌ట్టున్నాడు వీడు. ముందు నువ్వు గోడ స‌పోర్ట్ లేకుండా స‌రిగ్గా కూర్చోవ‌డం నేర్చుకోరా. త‌ర్వాత సినిమాను ఆడియ‌న్స్‌ని ఉద్ధ‌రిద్దువు గానీ..! నాకు కాలుతోంది కానీ నీది ఆల్రెడీ కాలిపోయిన ఫేస్. ఏం చేస్తాం. నువ్వే మాట్లాడాలి మా తార‌క్ అన్న అందం గురించి “” అని గ‌ట్టిగా క్లాస్ పీకారు.