Heart Attacks: ఈ 4 సూపర్ ఫుడ్స్‌కి దూరంగా 60% మంది జనాభా
Heart Attacks: ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో 60 శాతం మంది నాలుగు సూపర్ ఫుడ్స్‌కి దూరంగా ఉంటున్నారట. దీని వల్లే శరీరానికి సరైన పోషకాలు అందకుండా గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి బారిన పడుతున్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది. శరీరానికి కావాల్సిన అతి కీలక విటమిన్లలో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, ఈ ముఖ్యం. ఈ నాలుగు విటమిన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 శాతం మంది దూరంగా ఉంటున్నారట. వీటితో పాటు అయోడిన్, రైబోఫ్లేవిన్, ఫోలేట్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, థియామిన్, నియాసిన్, విటమిన్ B6, B12 కూడా సరిగ్గా అందని ఆహారం తీసుకుంటున్నారట.
ఈ విటమిన్లు అన్నీ కూడా గుండె, ఎముకలు, రోగనిరోధక శక్తికి ఎంతో కీలకం. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు వివిధ కేటగిరీల్లో చేపట్టిన సర్వేల్లో తేలింది ఏంటంటే.. ఎవ్వరూ కూడా ఒక్క విటమిన్‌ని కూడా పుష్కలంగా తీసుకోవడంలేదు. దీని వల్లే చిన్న వయసులోనే క్యాన్సర్లు, గుండెనొప్పులు, కీళ్లవాతం వంటివి సంభవిస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒంట్లో ఏ విటమిన్ తక్కువగా ఉందో వైద్యులు చెప్తారని వాటికి సంబంధించిన ఆహారాలు, సప్లిమెంట్లు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.