Gudivada Amarnath: మా వీక్నెస్ అదే.. అందుకే ఇబ్బందిపడుతున్నాం
Gudivada Amarnath: వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి.. పార్టీ నేతలకు ఒక వీక్నెస్ ఉందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తమకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులాగా పబ్లిసిటీ చేసుకోవాలి అనే వీక్నెస్ లేదని సెటైర్ వేసారు.
“” ఒక వరద వచ్చినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగితే అది ప్రకృతి వైపరిత్యం అనుకోవాలి. కానీ ముందుగానే హెచ్చరికలు వచ్చాయి అని కలెక్టర్, అధికారులు చెప్తున్నా కూడా ముఖ్యమంత్రి ఏ చర్యలు తీసుకోలేదంటే ఇచ్చి కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. వరదలు వస్తే మాపై నెట్టేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గోడను బోట్లతో కొట్టించామని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఆ వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? చేయించండి ఎంక్వైరీలు.
నిజాలు అవే బయటికి వస్తాయి. రాష్ట్రంలో ఏదన్నా మంచి జరిగితే అది తెలుగు దేశం పార్టీ వల్ల అని చెడు జరిగితే వైఎఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని అంటున్నారు. ఇదేం లాజిక్? మా జగనన్నకు, పార్టీ నేతలకు ఓ వీక్నెస్ ఉంది. మాకు పబ్లిసిటీ చేయించుకోవడం రాదు. ఒక ముఖ్యమంత్రి కంట్రోల్ రూంలో కూర్చుని చర్యలు తీసుకోకుండా జేసీబీలు ఎక్కాల్సిన అవసరం ఏముంది? పైగా జేసీబీల్లో కెమెరామ్యాన్లను పెట్టించి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఈ తెలుగు దేశం పార్టీ చేస్తున్న విన్యాసాలు చూడలేకపోతున్నాం. ఈ పబ్లిసిటీ పిచ్చి మాకు లేదు కాబట్టి మాపై నిందలు వేస్తున్నారు“” అని తెలిపారు అమర్నాథ్.