Natasa Stankovic: వేరే కాపురం పెడదాం అంది.. మాజీ ప్రియుడి ఆరోపణ
Natasa Stankovic: స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిక్‌ల విడాకులు సంచలనంగా మారాయి. పెళ్లికి ముందు నటాషా గర్భం దాల్చడంతో హార్దిక్ హుటాహుటిన ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీరికి ఓ కొడుకు పుట్టాడు. గతేడాదే ఇద్దరూ క్రైస్తవ, హిందూ సంప్రదాయాల్లో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈలోగా ఏమైందో ఏమో.. తాము విడిపోతున్నామంటూ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో నటాషా మాజీ ప్రియుడు అలీ గోనీ ఓ విషయాన్ని బయటపెట్టాడు. తాను నటాషా ప్రేమించుకున్నప్పుడు కలిసి ఉండేవాళ్లమని.. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నామని చెప్పాడు. అయితే పెళ్లి తర్వాత నటాషా వేరే కాపురం పెడదామని అనడంతో తాను ఒప్పుకోలేదని అలా తమకు బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. తాను ఎక్కడుంటే తన కుటుంబం అక్కడ ఉంటుందని ఎవ్వరి కోసమూ తాను తన తల్లిదండ్రుల్ని వదిలి వేరుగా ఉండదలచుకోలేదని అలీ గోనీ వెల్లడించారు. ప్రస్తుతం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని సెర్బియా వెళ్లిపోయింది.