RK Roja: పార్టీ పేరును తొల‌గించేసిన రోజా

rk roja removes party name from twitter handle

RK Roja: వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎగిరిప‌డ్డారు ఆర్కే రోజా. ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. త‌న కోసం తాను పర్య‌ట‌న‌లు చేసుకున్నారే త‌ప్ప పర్యాట‌క రంగాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయ‌లేదన్న ఆరోప‌ణ‌ల‌ను మూట‌గ‌ట్టుకున్నారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం కావ‌డంతో ఆనాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రోజా అస‌లు మీడియా ముందుకు కానీ ప్రజ‌ల ముందుకు కానీ రాలేదు.

ప్ర‌స్తుతం త‌న పిల్ల‌ల‌తో కలిసి విదేశాల్లో సేద‌తీరుతున్నారు. అయితే.. రోజా ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి త‌మిళ రాజ‌కీయాల్లో అడుగుపెట్టాల‌నుకుంటున్న‌ట్లు ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. త‌మిళ న‌టుడు విజ‌య్ స్థాపించిన త‌మిళగ వెట్రి క‌జ‌గం పార్టీలో చేర‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అయితే ఇప్పుడు రోజా త‌న ట్విట‌ర్ హ్యాండిల్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరునే తొల‌గించేయ‌డంతో ఈ ఊహాగానాల‌కు మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్లైంది.

త‌న ట్విట‌ర్ హ్యాండిల్‌లో కేవ‌లం మాజీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి, న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే అని మాత్ర‌మే పెట్టుకున్నారు. అయితే.. ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైఎస్ భార‌తిల పెళ్లి రోజు కావ‌డంతో వారిద్ద‌రి ఫోటోను పోస్ట్ చేస్తూ అన్నా వ‌దిల‌కు పెళ్లిరోజు శుభాకాంక్ష‌లు అంటూ విషెస్ తెలిపారు.