Olive Oil: వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో గుండెకు ముప్పు

consumption of extra virgin olive oil is bad to your heart

Olive Oil: నూనెల్లో ఆలివ్ ఆయిల్ మంచిద‌ని చెప్తుంటారు. దీనిని నేరుగా స‌లాడ్ల‌పై వేసుకుని తినేయ‌చ్చు. ఆరోగ్యానికి కూడా మంచిద‌ని అంటుంటారు. కానీ కొంద‌రు ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడుతుంటారు. ఆలివ్ ఆయిల్ అంటే కాస్త రిఫైన్ చేసి అమ్ముతుంటారు. ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ అంటే ఆలివ్స్ నుంచి నేరుగా నూనె తీస్తుంటారు. దీనిలో ఏమీ క‌ల‌పరు. అంటే గానుగ నుంచి తీసిన నూనె అనుకోవచ్చు. అయితే ఈ ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ తినేవారిలో విప‌రీతంగా చెడు కొలెస్ట్రాల్ ఎక్కువై గుండె స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంద‌ట‌.

ఫ్లోరిడా యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు సాధార‌ణ ఆలివ్ ఆయిల్ తినే వారిపై.. ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ తినే వారిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌గా.. ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆలివ్ ఆయిల్ తినే వారిలో విప‌రీతంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంద‌ని తేలింద‌ట‌. కాబ‌ట్టి సాధార‌ణ ఆలివ్ ఆయిల్ సేవిస్తే స‌రిపోతుంద‌ని.. మ‌రీ ఎక్స్‌ట్రా వ‌ర్జిన్ ఆయిల్స్ జోలికి పోక‌పోవ‌డ‌మే మంచిదని ప‌రిశోధ‌కులు చెప్తున్నారు.