Lifestyle: ఫ్రెండ్ సలహా.. వేశ్యతో సెక్స్ చేసి HIV తెచ్చుకున్న యువకుడు
Lifestyle: పెళ్లికి ముందు ఒక్కసారైనా శృంగారం విషయంలో అనుభవం ఉండాల్రా.. అని స్నేహితుడు ఇచ్చిన సలహా కారణంగా ఓ యువకుడు తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. తన జీవితంలో ఏం జరిగిందో ఆ యువకుడి మాటల్లోనే తెలుసుకుందాం.
“” హాయ్ ఫ్రెండ్స్. నా ఊరు పేరు చెప్పుకోలేను కానీ. నా జీవితంలో జరిగిన దారుణం గురించి మాత్రం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా వయసు 32. నాకు గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు కానీ నేను ఏనాడూ వారితో తప్పుగా ప్రవర్తించింది లేదు. పెళ్లికి ముందు ఎవ్వరితోనూ సెక్స్ చేసింది కూడా లేదు. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ ఒకడు ఒక సలహా ఇచ్చాడు. పెళ్లికి ముందు అనుభవం లేకపోతే ఆ తర్వాత నీ భార్య నీపై అనుమాన పడుతుందిరా.. నా మాట విని ఓసారి ఈమె దగ్గరికి వెళ్లు అని ఓ అడ్రెస్ ఇచ్చాడు.
అది వేశ్యల గృహం అని నాక్కూడా తెలుసు. కానీ ఎందుకో వాడు ఇచ్చిన సలహా నా మంచికే అనుకున్నాను. ఎందుకంటే ఈరోజుల్లో సెక్స్ విషయంలోనే ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు అవుతున్నాయి. అలా నాకు జరగకూడదు అనుకున్నా. అలా నా ఫ్రెండ్ ఇచ్చిన అడ్రెస్‌కి వెళ్లా. నా పని కానిచ్చేసి ఇంటికి వెళ్లిపోయా. నాకు కాబోయే భార్యను సంతృప్తి పరచగలను అనిపించింది. ఆ తర్వాత సంబంధాలు చూడమని ఇంట్లో వారికి చెప్పాను. వారు అదే పనిలో పడ్డారు. ఇంకొన్ని నెలల్లో నేను ఓ ఇంటివాడిని అవుతాను అనగా.. నా ప్రపంచం తలకిందులు అయ్యే విషయం ఒకటి తెలిసింది. నాకు హెచ్ఐవి అని.
ఇది నేను ఆ వేశ్య గృహానికి వెళ్లడం వల్ల వచ్చిందా లేక మరేదైనా కారణమా అని మాత్రం నాకు తెలీదు. ఆ గృహానికి వెళ్లి ఆ యువతిని నిలదీద్దామంటే నేను అలాంటి పని చేసాను అని ఇంట్లోవారికి తెలిస్తే చచ్చిపోతారు. దాంతో ఆ బాధను భరిస్తూ రోజూ నరకం అనుభవిస్తున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే.. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ ప్రతి గ్యాంగ్‌లో ఎవరో ఒకరు ఉంటారు. వారు మన చెడు కోరి ఇలాంటి సలహాలు ఇవ్వరు. కానీ వారు చెప్పినవన్నీ విని చేసేసి నాలా బాధపడకూడదు అని ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను “”