Donald Trump: అంటే ఆమెకు నేనంటే ఇష్టమ‌న్న‌మాట‌..!

donald trump talks about his wife melania trump

Donald Trump: అమెరికా అధ్య‌క్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవ‌ల హ‌త్యాయ‌త్నం జరిగిన సంగ‌తి తెలిసిందే. ఓ 20 ఏళ్ల యువకుడు ట్రంప్‌పై కాల్పులు జ‌ర‌ప‌డంతో ట్రంప్ చెవికి గాయ‌మైంది. దాంతో ఆయ‌న తృటిలో త‌ప్పించుకున్నారు. అయితే డొనాల్డ్ భార్య మెలానియా ట్రంప్ త‌న స్పీచ్ టీవీలో చూస్తున్న‌ప్పుడే త‌న‌పై ఎటాక్ జ‌రిగింద‌ని.. దాంతో మెలానియా షాక్‌కు గురైంద‌ని తెలిపారు. త‌ను అలా షాక‌వ్వ‌డం త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని.. అలా షాకైందంటే త‌నపై ఆమెకు ప్రేమ ఉన్న‌ట్లే క‌దా అని పేర్కొన్నారు.