Game Changer: ప‌వన్ క‌ళ్యాణ్‌తో వ‌ద్ద‌న్నారా?

did dil raju said no to pawan kalyan in game changer

Game Changer: ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దాదాపు ఐదేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ అవుతోంది. ఇప్ప‌టికీ ఇంకా కొన్ని షాట్స్ చిత్రీక‌రించాల్సి ఉంది. అయితే శంక‌ర్ ఈ సినిమా క‌థ‌తో నిర్మాత దిల్ రాజు ద‌గ్గ‌రికి వెళ్లిన‌ప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తీసుకుందాం అని అడిగార‌ట‌. అయితే ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నార‌ని.. ఆయ‌న కాల్‌షీట్స్ టైంకి దొర‌క్క‌పోతే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పి ప‌వ‌న్‌ని వ‌ద్ద‌న్నార‌ట‌. దాంతో గేమ్ ఛేంజ‌ర్ రామ్ చ‌ర‌ణ్‌కి వెళ్లిన‌ట్లు ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమాను సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నారు.