Lifestyle: బాస్‌తో ఎఫైర్.. ఉద్యోగం పోతుందని భయం
Lifestyle: నా వయసు 26. ఇంకా పెళ్లి కాలేదు. మంచి కంపెనీలో ఉద్యోగం. ఈ మధ్యకాలంలో మా బాస్‌కి నాపై ఇష్టం ఉందని కొందరి ద్వారా తెలిసింది. అందుకే ఆయన నాతో ఎక్కువ మీటింగ్స్ పెట్టడం.. హైక్స్ ఇవ్వడం వంటివి చేస్తున్నాడని తెలిసింది. నా వర్క్ నచ్చి ఇవన్నీ ఇస్తున్నారని అనుకున్నా. కానీ మ్యాటర్ వేరే అని తెలిసి షాకయ్యా. ఇప్పుడు ఆయన పిలిచినప్పుడల్లా క్యాబిన్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. ఆయన చెప్పినదానికి కాదంటే నా ఉద్యోగం పోతుందని భయంగా ఉంది. ఏదన్నా సలహా ఇవ్వగలరు.
నిపుణుల సలహా
ఇక్కడే మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీ బాస్‌తో ఎఫైర్ పెట్టుకోకపోతే ఉద్యోగం పోతుంది అని భయపడి చేయకూడని తప్పు చేస్తారా? అది ఇంకా పెద్ద తప్పు. మీకు మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటే మీలో నైపుణ్యాలు ఉన్నాయని అర్థం. మీ బాస్‌కు మీరంటే ఇష్టం అని వేరే వారి ద్వారా తెలిసింది అంటున్నారు. అంటే ఈ విషయం మీకు తెలుసు అనే విషయం మీ బాస్‌కి తెలీదు. కాబట్టి.. మీరు ఏమీ తెలీనట్లు ఉండండి. మీ పని మీరు చేసుకోండి. మీ బాస్ నేరుగా వచ్చి మీకు ఈ విషయం చెప్పినప్పుడు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలి. ఇవేమీ వద్దు నాకు ప్రశాంతమైన జీవితం కావాలి అనుకుంటే మీకున్న స్కిల్స్‌తో వేరే కంపెనీలో ఉద్యోగం వెతుక్కోవడం మంచిది. అంతేకానీ బాస్ ఫీలవుతాడని అఫైర్లకు ఓకే చెప్తే చివరికి నాశనం అయ్యేది మీ జీవితమే అని గుర్తుంచుకోండి.