Vijaya Sai Reddy: వారిని ముండాకొడుల్లారా అని తిట్టింది నిజం కాదా.. పకోడీలు అమ్ముకునే నాయాలా
Vijaya Sai Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయ సాయిరెడ్డి మహా న్యూస్ ఛానెల్ ఎండీ వంశీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి వంశీపై సెటైర్లు వేస్తూ వరుస ట్వీట్లు వేసారు.
“” జర్నలిస్టులను, ఫోర్త్ ఎస్టేట్‌ను అవమానించారు అని టాల్కమ్ పౌడర్ డబ్బా పదేపదే విమర్శలు చేస్తున్నాడు. కానీ “మహాచెత్త న్యూస్”లో ఉద్యోగులను అరేయ్, ఒరేయ్ అంటూ టాల్కమ్ అజ్ఞాని చిందులు తొక్కడం నిజం కాదా?
“ముండాకొడుకులు” అని తిట్టడం నిజం కాదా? పనిచేసే సిబ్బందిని టాల్కమ్ బూతులు తిడుతుంటాడు … అందరితో అమర్యాదగా ప్రవర్తిస్తాడు……ఈ పౌడర్ డబ్బానా కోటు వేసుకుని తెరపై కూర్చుని నీతులు చెప్పేది? అలాగే సంస్థలో పనిచేసే డబ్బా ప్రైవేట్ సైన్యంలోని మనుషులు యాంకర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఏమైనా చర్యలు తీసుకున్నావా?
అసలు చానెల్ కొనడానికి, మరి నిర్వహణకు మేదరమెట్లలో వీధి బండిలో చికెన్ పకోడీలు అమ్ముకొనే నీకు డబ్బులు ఎక్కడివి? యాడ్స్ రూపంలో ఎంత వస్తున్నాయి? మిగిలినవి ఎక్కడి నుంచి తెస్తున్నావు? హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీలపై ప్రోమోలు నడిపి వారిని బెదిరించి నీవు డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే చానెల్లో లైవ్‌లు నడిపి బ్లాక్ మెయిల్ చేయడం నిజం కాదా? చివరికి కలెక్టర్ అమోయ్ కుమార్‌ను కూడా బెదిరించే స్థాయిలో వరుస ప్రోమోలు, కథనాలు ప్రసారం చేయలేదా ? మేటర్ సెటిలైతే కథనాలు ఆపేయడం నీకు మామూలేకదా? అన్ని చానెల్స్ వార్తలు ప్రసారం చేస్తే…నీ చానెల్లో ప్రసారమయ్యేవి బ్లాక్ మెయిల్ వార్తలేగా?
నీ సంస్థలో పనిచేసే సిబ్బందిలో ఎంత మందికి జీతాలిస్తున్నావు? రెండు రాష్ట్రాల్లో రిపోర్టర్లకు నీవు జీతాలు ఇవ్వకుండా కేవలం యాడ్స్ డిమాండ్ చేసి కమీషన్లను చూపి, వారిని కలెక్షన్ ఏజెంట్లను చేసి తప్పుదారి పట్టిస్తున్నావా? లేదా? జిల్లా రిపోర్టర్లకు నీవు జీతాలు ఇవ్వవు కదా? నీవా జర్నలిజం గురించి పాఠాలు చెప్పేది? సంస్థలో పనిచేసే నీ ప్రైవేట్ సైన్యంలోని నీ చెంచా… తప్పతాగి ఓ యాంకర్‌తో అసభ్యంగా ప్రవర్తిస్తే నీవేం చర్యలు తీసుకున్నావు? అలాగే మీ సిబ్బందికి పీఎఫ్‌లు చెల్లిస్తున్నావా? అసలు ఎంత మందికి నీవు బ్యాంకుల ద్వారా జీతాలిస్తున్నావ్?
చంద్రబాబు పీఆర్వో రమేష్‌తో నీకున్న సంబంధాలు ఏంటి? చంద్రబాబు, లోకేష్‌కు దగ్గరకావడానికి నీవు చేస్తున్న ప్రయత్నాలేంటి? చానెల్‌ను అడ్డం పెట్టుకుని కవరేజ్ అంటూ ఎన్నికలకు ముందు టీడీపీ అభ్యర్థుల నుంచి కోట్లలో సొమ్ము దండుకున్నది నిజం కాదా ? మిగిలిన చానెల్స్ ఇలా ఐటెమ్‌ల చొప్పున డబ్బులు వసూలు చేశాయా? “” అంటూ వంశీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసారు.