India vs Pakistan: ఇండియా పాక్ మ్యాచ్.. అక్కడ మాత్రం వద్దు బాబోయ్ అంటున్న BCCI
India vs Pakistan: 2025లో జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో భాగంగా BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో మాత్రం వద్దని వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు అంతగా బాలేని నేపథ్యంలో 2008 తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లి వారితో మ్యాచ్ ఆడింది లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్థాన్‌తో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జరగాలని PCB (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) నిర్ణయించింది. ఇందుకు బీసీసీఐ ససేరిమా అంది.
ఒకవేళ టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లి ఆడాల్సిన అవసరం వస్తే అందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తేనే వెళ్తాం అని BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. గతేడాది ఆసియా కప్ విషయంలోనూ ఇదే జరిగింది. పాకిస్థాన్ ఆతిథ్యం వహించాల్సిన మ్యాచ్‌ను సెక్యూరిటీ కారణాల వల్ల శ్రీలంకకు షిఫ్ట్ చేసారు. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.