War 2: వాళ్లు వ‌ద్దన్నారు.. తారక్ ఒప్పుకున్నాడు!

Hyderabad: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (ntr) బాలీవుడ్ (Bollywood) ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. య‌శ్ రాజ్ ఫిలింస్ (yrf) స్పై యూనివ‌ర్స్(spy universe) కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిస్తున్న వార్ 2(war 2) సినిమాలో తార‌క్ న‌టించ‌బోతున్నాడు. 2019లో బాలీవుడ్ న‌టులు హృతిక్ రోష‌న్‌(hrithik roshan), టైగ‌ర్ ష్రాఫ్(tiger shroff) న‌టించిన వార్ సినిమాకు సీక్వెల్‌గా వార్ 2(war 2) రాబోతోంది. అయితే ఈ ఛాన్స్ తార‌క్ కంటే ముందు ఇద్ద‌రు హీరోలకు వ‌చ్చింద‌ట‌. కానీ వాళ్లు ఒప్పుకోలేద‌ని టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఈ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో కాదు.. యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌ (prabhas), రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (vijay devarakonda). య‌శ్ రాజ్ ఫిలింస్ ముందు ప్ర‌భాస్‌ను సంప్ర‌దించ‌గా.. త‌నకు ఆల్రెడీ చాలా సినిమా క‌మిట్మెంట్లు ఉన్నాయ‌ని నో అన్నాడ‌ట‌. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండను అడిగార‌ట‌. అప్ప‌టికే లైగ‌ర్(liger) ఫ్లాప్‌తో కాస్త బాధ‌లో ఉన్న విజ‌య్‌.. ఇక‌నైనా ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలుసుకుని జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల‌న్న ఉద్దేశంలో ఉన్నాడు. దాంతో వార్ 2కి విజ‌య్ కూడా నో చెప్పిన‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) సినిమాతో ఆస్కార్ (oscar)అందుకుని గ్లోబ‌ల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న తార‌క్ అయితే బాగుంటుంద‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. ఎన్టీఆర్‌ని సినిమాలో తీసుకుంటే ఇటు తెలుగు మార్కెట్ల‌లో కూడా సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌డుతుంద‌ని ప్లాన్ వేసింది నిర్మాణ సంస్థ‌. ఇక ఇందులో హీరోయిన్‌గా ఆలియా భ‌ట్(alia bhatt) న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.