Viral News: పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడి ఆత్మహత్య
Viral News: పెళ్లైన కొన్ని గంటల్లోనే వరుడి ఆత్మహత్యతో వధువు గుండెపగిలింది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో చోటుచేసుకుంది. జులై 3న రతన్‌పురా గ్రామంలో ఘనంగా ఓ పెళ్లి వేడుక జరిగింది. సతేంద్ర కుమార్, వినీతా అనే వధూవరులకు పెళ్లి జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొన్ని గంటల తర్వాత సతేంద్ర కుమార్ తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే సతేంద్ర కుమార్ ఒంటరిగా తన గదిలోకి వెళ్లాడు. ఎంతసేపటికీ గది నుంచి బయటికి రాకపోవడంతో ఫోన్ కాల్స్ చేసారు. అయినా అతను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత తలుపులు బద్దలుకొట్టి చూడగా సతేంద్ర కుమార్ ఉరేసుకుని కనిపించాడు. దాంతో అంతా హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని పోస్ట్మార్టెంకు తరలించారు.