Movies: ఈవారం రిలీజులు..!

Hyderabad: ఈ ఏడాది ప్రారంభం నుంచీ వారం వారం కొత్త సినిమాల విడుదలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ వారం మూడు తెలుగు సినిమాలు(Telugu Movies) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏంటో ఒకసారి చూసేద్దాం.
శాకుంతలం
సమంత(Samantha), దేవ్ మోహన్(Dev Mohan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను గుణశేఖర్(Gunashekar) రూపొందించారు. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతలం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు. శకుంతలం(Shaakunthalam) ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
రుద్రుడు
స్టార్​ కొరియోగ్రాఫర్ రాఘవ​ లారెన్స్​(Raghava Lawrence) నటుడుగానూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న రుద్రుడు అనే తమిళ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది తమిళ సినిమా అయినప్పటికీ కూడా తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు దర్శకనిర్మాతలు. ప్రియ భవాని శంకర్ హీరోయిన్​గా నటిస్తున్నఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
విడుదల
విజయ్ సేతుపతి(Vijay Sethupathi), సూరి కీలకపాత్రలు పోషించిన విడుదలై సినిమా మొదటి భాగం గతవారం తమిళంలో విడుదలైంది. ఊహించని రీతిలో కలెక్షన్లను సాధిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాను ‘విడుదల’గా నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్ 15న ఈ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది.