ICC Rankings: వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1..!

hardik pandya is world number one all rounder according to ICC Rankings

ICC Rankings: టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆల్ రౌండ‌ర్‌గా త‌న స‌త్తా చూపించి IPL స‌మ‌యంలో ఛీ కొట్టిన వారి చేతే జేజేలు కొట్టించుకుంటున్నాడు హార్దిక్ పాండ్య‌. ఈ నేప‌థ్యంలో ICC మెన్స్ T20I ర్యాంకింగ్స్‌లో పాండ్య ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1 ఆల్‌రౌండ‌ర్‌గా ఉన్నాడ‌ని ICC అధికారికంగా ప్ర‌క‌టించింది. T20 వ‌రల్డ్ క‌ప్‌లో మొత్తం 8 మ్యాచ్‌ల‌కు గానూ పాండ్య 144 ప‌రుగులు సాధించాడు. అత‌ని స్ట్రైక్ రేట్ 151.57 ఉంది. అంతేకాదు ఈ 8 మ్యాచ్‌ల‌లో 11 వికెట్లు తీసిన ఘ‌న‌త‌ను కూడా సాధించాడు. ఇక ర్యాంకింగ్స్‌లో జ‌స్ప్రీత్ బుమ్రా 12వ స్థానంలో, అర్ష్‌దీప్ సింగ్ 13వ స్థానంలో కుల్దీప్ యాద‌వ్ 8వ స్థానంలో ఉన్నారు.