Blocked Heart Symptoms: మగవారిలో ఈ లక్షణాలు ఉంటే.. గుండె సమస్య ఉన్నట్లే
Blocked Heart Symptoms: మగవారిలో కొన్ని లక్షణాలను బట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం సులువు. ఈ లక్షణాలు మీకు ఉన్నట్లైతే వెంటనే వైద్యులు సంప్రదించాల్సిందే. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన మగవారు ఈ విషయాలను తెలుసుకోవడం తప్పనిసరి.
గుండెలో ఉండే ధమనులు మూసుకుపోతే రక్త ప్రసరణ ఆగిపోయి గుండెపోటు వస్తుంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసిందే. అయితే ఆ ధమనులు మూసుకుపోతున్నాయి అని తెలిపేందుకు కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేంటంటే.. ఈ ధమనులు మూసుకుపోవడానికి ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్. ఈ చెడు కొలెస్ట్రాల్ తగిన మోతాదులో శరీరానికి అసవరం. అంతకంటే ఎక్కువైతే మాత్రం గుండెపోటుకు దారితీస్తుంది.
ధమనులు మూసుకుపోతున్నాయని తెలిపే లక్షణాలివే
కాళ్లు విపరీతంగా నొప్పులు పెడుతుంటాయి. మోకాళ్లు, తొడలు, పిర్రలు నొప్పి పెడుతుంటాయి. నడుస్తున్నప్పుడు ఆ నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పిని క్లాడికేషన్ అంటారు. రక్తప్రసరణ ధమనులకు సరిగ్గా జరగకపోతే ఈ నొప్పులు వస్తాయి.
ఉన్నట్టుండి కాళ్లు పాదాల కింద స్పర్శ తెలీకుండాపోతుంది. ఇది కూడా ఒక లక్షణమే.
కాళ్లు, పాదాల చర్మ రంగు మారిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో అల్సర్లు కూడా వస్తుంటాయి.
పాదాలు, కాలి వేళ్లు చల్లబడిపోతుంటాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాకుండా వేడిగా ఉన్నప్పుడు కూడా వేళ్లు చల్లబడుతున్నాయంటే అది పెద్ద రిస్క్ అని తెలుసుకోవాలి.
కాళ్లపై వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఎలాగైతే కుదుళ్లకు రక్తప్రసరణ అందక జుల్లు రాలుతుందో కాళ్ల నరాలకు రక్తప్రసరణ అందక కాలిపై ఉండే వెంట్రుకలు రాలిపోతుంటాయి.
స్తంభన సమస్య ఉన్నా కూడా గుండె ధమనుల్లో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి. ఏ ఒక్క లక్షణం లేకపోయినా ఒకసారి గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిది.