Renu Desai: విడిపోయినంత మాత్రాన నేను దురదృష్టవంతురాలిని కాను
Renu Desai: తాను పవన్ కళ్యాణ్‌తో విడిపోయినంత మాత్రాన దురదృష్టవంతురాలిని అయిపోను అని అన్నారు నటి రేణూ దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో విడిపోయి మీరు దురదృష్టవంతులు అయ్యారు మేడమ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టడంతో రేణూ దేశాయ్ మండిపడ్డారు.
“” కొన్నేళ్లుగా నన్ను దురదృష్టవంతురాలు అని కామెంట్స్ పెట్టి బాధపెడుతున్నారు. నా భర్త నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటే అందులో నా దురదృష్టం ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మాయికైనా అబ్బాయికైనా విడాకులు తీసుకున్నంత మాత్రాన వారు దురదృష్టవంతులు అయిపోరు. అయినా ఒకరి అదృష్టం లేదా సంతోషం అనేది మరో మనిషితో మాత్రమే ఎందుకు ముడిపడి ఉండాలి. నేను అనుభవిస్తున్న ఈ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. నా దగ్గర లేని దాని కోసం నేనెందుకు బాధపడాలి “” అని క్లాస్ పీకారు.